రకాలు:
ఎన్.ఎ.-8, ఎన్.ఎ.-9, ఆనంద్ -1, ఆనంద్ -2, ఫ్రాన్సిస్, బనారసి రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రకాలు మూడవ సంవత్సరాల పూతను తుంచి వేయుట మంచిది. అయితే మంచి దిగుబడులు 5- 6 సంవత్సరాల నుండి ఇస్తాయి.
మొక్కల ఎంపిక:
శాఖీయోత్పతీ చెట్లనే (మొగ్గంట్లు) లేదా వేడ్జే అంటు పద్ధతిలో తయారు చేసిన అంటు మొక్కలను మాత్రమే నాటుకోవాలి. ఉసిరి విత్తనం ఏక పిండోత్ప్దాకం. దాని నుండి వచ్చిన చెట్లు తల్లి పోలికలు కలిగి వుండవు. కాబట్టి విత్తన ప్రవర్ధనం చేయరాదు. శాఖీయోతప్తి ద్వార ప్రవర్ధనం చేసిన మొగ్గ అంట్లు త్వరగా కాపుకొస్తాయి. కావున పంటపై ఖర్చును తగ్గించుకోవచ్చు. నాణ్యమైన ఒకే మాదిరి పంట నుండి మంచి ధర పొందవచ్చు. సాఖీయోతప్తి వలన కొన్ని చెదపీదల నుండి పంటను కాపాడవచ్చు.